English   

సైరాలో జూనియర్ ఆర్టిస్ట్ మృతి 

Sye Raa
2019-05-16 14:46:15

ఎండల తీవ్రత ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ ఎండల బారిన పడి ఓ రష్యన్ వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి చెందిన కెమెరాలోని ఫొటోల ఆధారంగా అతను సైరా సినిమాలో నటించినట్లు పోలీసులు గుర్తించారు. రష్యా దేశానికి చెందిన అలెగ్జాండర్ టూరిస్టు వీసా మీద మార్చి నెలలో హైదరాబాద్‌కు వచ్చాడు. కొద్ది రోజుల క్రితం ఆయన గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ గేట్ నెంబర్ -1 వద్ద అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యుల సూచన ప్రకారం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ రెండ్రోజుల క్రితం మృతి చెందినట్లు సమాచారం. అతని కెమెరాలోని ఫోటోల ద్వారా అతను ఈ నెల 4, 5 తేదీల్లో ‘సైరా’ సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా నటించాడని పోలీసులు గుర్తించారు. ఆయన గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్‌ లో దిగాడు. ఇక మే 10వ తేదీన హోటల్ ఖాళీ చేసిన ఆయన ఆ తర్వాత రోడ్లపైనే తిరిగాడని ఈ క్రమంలోనే వడదెబ్బకు గురయి అలెగ్జాండర్ మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు.  

More Related Stories