English   

బాలయ్య అనుగ్రహం కోసం బోయపాటి...ఏమయ్యేనో ?

Boyapati Srinu
2019-05-16 15:02:59

ఎన్నికలు అయిపోయిన తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని మహానాయకుడు ప్రీ రిలీజ్ అప్పుడే బాలయ్య ప్రకటించాడు. అయితే ఏమయిందో ఏమో కానీ అందరికి షాక్ ఇస్తూ కేఎస్ రవికుమార్ కథకి బాలయ్య ఓకే చెప్పాడు. దీంతో బాలకృష్ణ, బోయపాటికి హ్యాండ్ ఇచ్చాడని రకరకాల ప్రచారం మొదలయ్యింది. నిజానికి రవికుమార్ సినిమా తర్వాత బోయపాటి సినిమా ఉండనుందట, దానికి సంబంధించి బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందట. అయితే ఈ లోపు బోయపాటికి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందట ? ఇప్పటికే వినయ విధేయ రామ దెబ్బకి తనకి బాలయ్యే దిక్కు అనుకుంటున్నా టైంలో ఒక బడా ప్రొడ్యూసర్ బోయపాటిని సంప్రదించాడని 15 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డానికి కూడా ముందుకొచ్చాడని సమాచారం. అయితే బోయ‌పాటి మాత్రం అందుకు అంగీక‌రించ‌లేద‌ని బాలయ్యని కలిసి ఏ మాట చెబుతానని చెప్పారని అంటున్నారు. ఈ విషయం గురించి బాలయ్యతో దిస్కస్ చేసి  క్లారిటీ తెచ్చుకోవాలని అనుకుంటున్నారట. చూడాలి మరి బాలయ్య ఏమంటారో బోయపాటి ఏమి చేస్తాడో ? 

More Related Stories