English   

మహర్షి ఫస్ట్ వీక్ కలెక్షన్స్....జోరు మీద ప్రమోషన్స్ 

 Maharshi
2019-05-16 17:32:31

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌ నటించిన ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. తెలుగు సినిమాకి చెందిన ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి ఈ సినిమాను నిర్మించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. అలా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటివారంలో ఈ సినిమా 59.37 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 21.67 కోట్ల షేర్ ను సాధించడం విశేషం. మహేశ్ బాబు కెరియర్లోనే ఇవి అత్యధిక వసూళ్లని చెబుతున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ‘మహర్షి’ వసూళ్లు తగ్గాయి. ఐదో రోజు రూ.4.2 కోట్లు, ఆరో రోజు రూ.3.45 కోట్లు వసూలు చేసి సరిపెట్టినట్లు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే వారం రోజులు పూర్తి కాకముందే ‘మహర్షి’ తెలుగు రాష్ట్రాల్లో రూ.60 కోట్ల షేర్ రాబట్టిందని అంటున్నారు.  గ్రాస్ కూడా దాదాపు 80 కోట్ల‌కు పైగా ఉంది. ఇక ఈ సినిమా బయ్యర్లు సేఫ్ కావాలంటే మ‌రో 30 కోట్లు రావాలి. రెండో వారం కూడా రిలీజయ్యే సినిమాలు లేకపోతే గనుక మ‌హ‌ర్షి దూకుడు కొన‌సాగేలా క‌నిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే  ప్ర‌మోష‌న్స్ కూడా భారీగానే చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ముఖ్యంగా రైతుల‌తో సూపర్‌స్టార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సినిమాలో లానే నిజ జీవితంలో కూడా తమతం ఉద్యోగాలు వ్యవసాయం చేసేందుకు వచ్చిన వారిలో కొందరు మహేశ్‌ తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు.

More Related Stories