English   

తాప్సీకి ఆయన మ్యారేజ్ మెటీరియల్ అంట ?

Taapsee Pannu
2019-05-16 18:37:50

కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెలుగులో వచ్చిన 'ఘుమ్మంది నాదం' సినిమాతో వెండితెరకు పరిచయమైన తాపసీ తెలుగులో వరుస సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ దక్కలేదు. దీంతో తమిళ, మళయాళంతో పాటు హిందీలో కూడా తన లక్ చెక్ చేసుకుంది. అయితే దక్షిణాదిన చెల్లని తాప్సీ బాలీవుడ్ లో మాత్రం బానే సినిమాలు చేసింది. ముల్క్, పింక్, జుడ్వా-2, నాం షభానా, బద్లా వంటి సినిమాలు పేరు తెచ్చాయి. బీఎఫ్ఎఫ్స్ విత్ వోగ్ – సీజన్ 3 షో కు బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విక్కీ కౌశల్ తో కలిసి హాజరయింది తాప్సీ. వీరిద్ద‌రూ మన్మర్జియా సినిమాలో కలిసి నటించారు. అయితే ఈ షో లో తాప్సీ విక్కీని పరిచయం చేస్తూ “అందరూ మగాళ్ళు ----కానీ విక్కీ ఈజ్ ది బెస్ట్” అని సంచలనం రేపింది. అంతే కాక వరుణ్ ధావన్.. విక్కీ కౌశల్.. అభిషేక్ బచ్చన్ ముగ్గురిలో ఎవరిని హుకప్.. ఎవరిని మ్యారీ.. ఎవరిని కిల్ చేస్తారు అని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వరుణ్ తో హుక్ అప్.. అభిషేక్ ను కిల్.. విక్కీ ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి షాక్ ఇచ్చింది. మరి ఈ లెక్కన భవిష్యత్తులో ఆయన్నిపెళ్లి చేసుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు బీ టవున్ వర్గాలు.

More Related Stories