English   

సైలెన్స్ గా అమెరికా చెక్కేస్తున్న స్వీటీ ?

Anushka shetty
2019-05-16 18:51:31

భాగమతి సినిమా తరువాత చాల గ్యాప్ తీసుకున్న అనుష్క ఈ మధ్యనే ఒక సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. లేడీ ఒరిఎంటెడ్ సబ్జెక్ట్ అయిన సైలెన్స్ అనే సినిమా చేయడానికి అనుష్క అంగీకరించింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. ఈ సినిమాకి కోన వెంకట్ కధ అందించడంతో పటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే కథ అంత అమెరికాలో జరగడం వలన ఈ సినిమా షూటింగ్ సింహ భాగం అమెరికాలో జరగనుంది. సినిమా యూనిట్ అంతా రెడీగా ఉన్నప్పటికీ అనుష్కకి వీసా విషయంలో ఏర్పడిన సమస్య ఇప్పుడు తీరడంతో ఈ సినిమా అమెరికాలో షూట్ ప్రారంభం కానుందట. ఇక ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ తో పాటు తమిళ హీరో మాధవన్, హీరోయిన్లు అంజలి, షాలినీ పాండేలు నటించనున్నారు. ఇక అనుష్క ఈ సినిమాతో పాటు సైరాలో కూడా ఒక రోల్ లో నటిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఆమెది చిన్న రోల్ కావడంతో ఆ షూట్ కూడా పూర్తి చేసిందని అంటున్నారు.

More Related Stories