English   

నాని ఆ గ్యాంగ్ కి లీడరా ?

Nani
2019-05-16 19:08:15

మొన్న రిలీజ్ అయిన జెర్సీ సినిమా నాని కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. అయితే మొదటి ఆయన నుండే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు పెద్దగా మాత్రం నమోదు కాలేదు. దీంతో ఇప్పుడు నాని ఫోకస్ గ్యాంగ్ లీడర్ మీదే ఉంది. నాని తాజా సినిమాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' రూపొందుతోంది. ఈ సినిమాలో నానితో పాటు ఐదుగురు అమ్మాయిలు ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నట్టుగా అప్పట్లో ఒక వార్త బయటికి రావడం దానికి అంత మంది ఎందుకురా బుజ్జా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే నిజానికి ఈ సినిమాలోని ఐదుగురు అమ్మాయిలు దొంగలుగా కనిపిస్తారని సమాచారం. ఇక ఆ ఐదుగురు లేడీ కేడీలకి నాయకుడే నాని అని అంటున్నారు. అంటే దొంగల గ్యాంగ్ కి నాని లీడర్ గా కనిపిస్తాడట. అందుకే నాని గ్యాంగ్ లీడర్ అయ్యాడు. మరి అయితే ఈ సినిమాలో తీసుకున్న ఆర్ఎక్స్ 100 కార్తికేయ రోల్ ఏమిటా అనేదే పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ సినిమాతో నాని - విక్రమ్ కుమార్ - కార్తికేయ లు హిట్ కొడతారేమో చూడాలి.
 

More Related Stories