English   

మణిరత్నం టైటిల్ తో కీర్తి ?

suresh
2019-05-16 20:34:47

మహానటి సినిమాతో ఓవర్ నైట్ లో ఇటు తెలుగులోను అటు తమిళంలోను కీర్తి సురేష్ కి క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమా ఆమె తెలుగులో సినిమా ఏమీ ఒప్పికోలేదు కానీ తమిళ్ లో మాత్రం స్టార్ హీరోల జోడిగా వరుస అవకాశాలను దక్కించుకుంటూ వెళుతోంది. ఇక తాజాగా ఆమె తెలుగులో కూడా ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఓకే చేసిందని అంటున్నారు. ఇక సినిమా కూడా సైలెంట్ గా మొదలయిపోయిందని ఈ సినిమా షూటింగు యూరోప్ లో జరుగుతోందని అంటున్నారు. నరేంద్ర అనే యువకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి 'సఖి' అనే టైటిల్ ను అనుకుంటున్నట్టుగా సమాచారం. సఖి అనగానే మణిరత్నం సూపర్ హిట్ చిత్రం గుర్తుకు వస్తుంది. మాధవన్ హీరోగా చేసిన ఆ సినిమా ఎవర గ్రీన్, అటువంటి సినిమా టైటిల్ అనుకుంటున్నారు అంటే సాహసమమే చెప్పాలి. అయినా దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ బ్రదర్స్ పీఆర్వో అయిన మహేష్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేశ్, నదియాలు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరో ప్రక్క కీర్తి సురేష్ మన్మధుడు 2 లో గెస్ట్ రోల్ చేస్తోందని అంటున్నారు దాని మీద అయిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

More Related Stories