English   

సీత రెడీ అవుతోంది ?

sita
2019-05-16 21:18:59

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌జంటగా తేజ దర్శకత్వంలో రూపొందిన సినిమా సీత. ఏటీవీ సమర్పణలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ మీద రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సీత టీజర్ అండ్ థియేట్రికల్ ట్రైల‌ర్‌కి మంచి స్పందన వస్తోంది. సినిమా మీద అంచనాలు కూడా పెంచుతోంది. ఇక తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది సీత. సినిమా చూసిన సెన్సార్ టీమ్, కొన్ని కట్స్ చెప్పి, యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి 161 నిమిషాలు. ఇక ఈ సినిమాని ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సోనూ సూద్ నటించాడు. రామాయణంలోని సీత క్యారెక్టర్‌‌ని, రాముడు క్యారెక్టర్‌ని ఈ జెనరేషన్‌కి తగ్గట్టు డిజైన్ చేసి, సీత మూవీలో చూపారని టీమ్‌ని ప్రశంసించారట సెన్సార్ వాళ్ళు. చూడాలి మరి ఈ సినిమా ఏమేరకు హిట్ అవుతుందో ?

More Related Stories