English   

తమిళ్ బిగ్ బాస్ క్లారిటీ వచ్చింది, ఇక తెలుగే ?

Kamal Haasan
2019-05-17 11:51:13

తమిళ బిగ్ బాస్-3 టీజర్ వచ్చేసింది. దీంతో క‌మ‌ల్‌ హోస్ట్ స్థానంలో న‌య‌న‌తార రానుంద‌న్న వార్త‌ల‌కిక ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్లే. నిన్న మొన్నటిదాకా బిగ్‌ బాస్ 3 త‌మిళ వర్స‌న్‌కి హోస్ట్‌గా న‌య‌న‌తార‌ని ఎంపిక చేశార‌ని ప్రచారం జరిగింది. బిగ్‌బాస్ మొద‌టి రెండు సీజ‌న్‌లు క‌మ‌ల్‌ హోస్ట్‌గానే న‌డిచాయి, ఆయ‌న రాజ‌కీయాల‌తో బిజీ కావ‌డం, త‌రుచుగా వివాదాల్లో ఇరుక్కుంటుండ‌డంతో క‌మ‌ల్ బ‌ద‌లు న‌య‌న్ అయితే బాగుంటుంద‌ని ఆ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌కులు ఆమెను సంప్రదించారని ప్రచారం జరిగింది. అయితే ఈసారి కూడా కమల్ ఏ హోస్ట్ చేయనున్నారని క్లారిటీ వచ్చినట్టయ్యింది. క‌మ‌ల్‌హాస‌న్ స్థాపించిన పార్టీ మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. క‌మ‌ల్ పోటీ చేయ‌లేదు కానీ ఆయ‌న పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. ఇక ఈ నేపధ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం కమలహాసన్ బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటారని స‌మాచారం.  ఈ నేపధ్యంలో ఇక తెలుగు వర్షన్ కి ఎవరు హోస్ట్ గా నిలుస్తారు అనేది సస్పెన్స్ గా మారింది.

More Related Stories