English   

ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీ ?

Rajinikanth
2019-05-17 16:50:48

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో దర్బార్ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈమధ్యనే ముంబైలో లాంఛనంగా ప్రారంభించారు.  తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని శుభస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.  రజినీకాంత్‌తో ఎ.ఆర్.మురుగదాస్ పనిచేయడం ఇదే తొలిసారి కాగా లైకా ప్రొడక్షన్స్‌లో ఇది రజినీకాంత్‌కు మూడో సినిమా. ఇక ఈ సినిమా గురించి తాజాగా కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి, ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ డ్యూయల్ రోల్ లో న‌టిస్తుండగా అందులో ఒకటి పోలీసు అధికారి పాత్ర అని తెలుస్తోంది. అందులో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపించనున్నాడని అంటున్నారు. ఇక తాజాగా ఎన్‌ కౌంటర్‌కు సంబంధించిన ఓ సన్నివేశాన్ని కూడా షూట్ చేసారని సమాచారం. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న తొలిషెడ్యూల్‌ నెలాఖరులోగా పూర్తికానుందట‌. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని రెండో షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉండగా ముంబయి షూట్ లో భాగంగా సెట్‌లో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారట రజనీ.

More Related Stories