English   

శ్రీ ముఖి సడన్ బ్రేక్ అందుకా ?

Srimukhi
2019-05-17 17:56:37

తెలుగు బుల్లితెర మీద లీడింగ్ యాంకర్స్ అంటే సుమ ఆమె తరవాత ‘జబర్దస్త్’ షోతో అనసూయ, రష్మి బాగా పాపులర్ అయ్యారు. ఇక, నటిగా ప్రయాణం ప్రారంభించి యాంకర్‌ గా మారిన బొద్దుగుమ్మ శ్రీముఖి కూడా ‘పటాస్’ షోతో మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే పటాస్ 2కి లేడీ యాంకర్ మారుతున్నారు. శ్రీముఖి స్థానంలో కొత్త యాంకర్ రాబోతున్నారు. ఈ విషయాన్ని శ్రీముఖి స్వయంగా చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం ప్రొడక్షన్ హౌస్ అనుమతితో షో నుంచి కొంచెం విరామం తీసుకుంటున్నాననీ పటాస్ ఫ్యాన్స్‌కి ఈ విషయం చెప్పాలనే బాధ్యతతో ఈ వీడియో చేశాననీ వీడియో మెసేజ్‌ను ట్విట్టర్‌లో పెట్టారు.  అయితే  ఆమె ఇలా హఠాత్తుగా బ్రేక్ తీసుకోవడానికి కారణమేమై ఉంటుందా అంటే ఆమెకి 'బిగ్ బాస్ 3' సీజన్ లో పాల్గొనే అవకాశం వచ్చిందనీ ఆ షోలో పాల్గొనడం కోసమే ఆమె బ్రేక్ తీసుకుందనేది ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందుతున్న తాజా సమాచారం. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ షో, జూలై రెండవ వారంలో ప్రారంభం కానుందని అంటున్నారు.

More Related Stories