English   

ప్రభాస్ క్రేజ్ పడిపోయిందా ? విజయ్ క్రేజ్ పెరిగిందా ?

Vijay Deverakonda
2019-05-17 18:30:51

ఏ ముహూర్తాన విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడో కానీ మనోడి సుడి మామూలుగా లేదు. సూపర్ స్టార్ మహేష్ లాంటి వాడే తన సినిమా చీఫ్ గెస్ట్ గా విజయ్ ని పిలిచాడంటే మనోడి క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక తాజాగా ప్రతిష్ఠాత్మక టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 టాప్-10లో కేవలం ఒకేఒక్క టాలీవుడ్ హీరోకు స్థానం లభించగా అది కూడా విజయ్ దేవరకొండకే లభించింది. ప్రతి ఏటాలానే 2018కి గాను టాప్50 సెలబ్రిటీలతో మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా విడుదల చేసింది టైమ్స్. ఈ లిస్టులో తెలుగు యువ హీరో విజయ్ దేవరకొండ నాలుగోస్థానంలో నిలిచాడు. ప్రథమస్థానంలో యూరీ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన విక్కీ కౌశల్, ద్వితీయస్థానంలో భారత ఫుట్ బాల్ ప్లేయర్, మోడల్ ప్రథమేశ్ మౌలింకర్ ఉన్నాడు. మూడో స్థానంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతకు ముందు ఏడాది కంటే రెండు స్థానాలు పెరిగి ఐదో ప్లేస్ లో నిలిచాడు. ఇక బాహుబలి స్టార్ ప్రభాస్ కు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో 12వ ర్యాంక్ ఇచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2017 సంవత్సరానికి గాను ప్రభాస్ కు ఇదే జాబితాలో సెకండ్ ర్యాంక్ లభించింది.  అంతలా ప్రభాస్ క్రేజ్ పడిపోయిందా లేక విజయ్ క్రేజ్ పెరిగిపోయిందా అనే చర్చ గట్టిగా సాగుతోంది.

More Related Stories