English   

నాని స్పీడ్ పెంచేశాడే ?

Nani
2019-05-17 19:07:02

జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నేచురల్‌ స్టార్‌ నాని తన తర్వాతి సినిమా కూడా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఆయన హీరోగా మనం ఫేం విక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్ మీద నిర్మితం అవుతున్న ఈ సినిమా ఆగష్టు 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాని దొంగ‌గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇందులో ఐదుగురు హీరోయిన్స్ దొంగలుగా నటిస్తుండగా ఆ దొంగల గ్యాంగ్ లీడ‌ర్‌ గా నాని కనిపించనున్నాడు. స్క్రీన్ ప్లే గురు అనిపించుకునే విక్ర‌మ్ ఇప్పుడు గ్యాంగ్ లీడ‌ర్ కోసం కూడా మంచి స్క్రీన్ ప్లే సిద్ధం చేశాడట, ఈ నెల 14 నుండి శంషాబాద్‌లో మూడో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అవగా జూన్ 30కి మొత్తం సినిమాకి గుమ్మడి కాయ కొట్టేస్తారట. ఒక నెలలో పోస్ట్ ప్రొడక్షన్ అవగొట్టి మరో నెలలోనే ప్రమోషన్స్ అండ్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు సినిమా యూనిట్. ఇంతకు మునుపు సినిమా సినిమాకి డిస్టెన్స్ మైంటైన్ చేసిన నాని ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచేసి సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా ఒప్పుకుని రిలీజ్ లు కూడా చేసేస్తున్నాడు.

More Related Stories