English   

అఖిల్ సినిమాకి ముహూర్తం కుదిరిందా ?

akhil
2019-05-17 19:50:50

హిట్ సినిమా హీరో అని అనిపించుకోడానికి అక్కినేని అఖిల్ పడని కష్టం లేదు. ఆయన కనీసం న మూడవ సినిమా 'మిస్టర్ మజ్ను'తో తప్పకుండా హిట్ కొడతాడని అభిమానులు భావించారు. కానీ ఈ సినిమా కూడా ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఈ నేపథ్యంలోనే అఖిల్ తన నాల్గొవ సినిమాను మలుపు డైరెక్టర్ సత్య పినిశెట్టి దర్శకత్వంలో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో అఖిల్ తదుపరి సినిమాకి క్రిష్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడనే మరో ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలలో నిజం లేదని,  అఖిల్ నాల్గవ సినిమా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఉండనుందని అది కూడా గీతా ఆర్ట్స్ సెకండ్ బ్యానర్లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవగా ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన లాంచ్ చేయనున్నారని అంటున్నారు. అలాగే ఎండలు తగ్గాక వచ్చేనెల నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారట. ఇక ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానీని కూడా ఫైనల్ చేశారట. ఈ ఏడాదిలోనే విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా కూడా సమాచారం.

 

More Related Stories