English   

ప్రముఖ టాలివుడ్ నటుడు కన్నుమూత

actor
2019-05-17 20:31:55

రంగస్థలం మీద నటుడిగా రాణించి ఆ అనుభవంతో సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా ఎంటర్ అయ్యి ఎన్నో సినిమాల్లో నటించిన నటుడు రాళ్ళపల్లి కన్నుమూశారు. ఎలాంటి పాత్రనైనా అలవోకగా నటించడంలో దిట్ట అయిన ఆయన కొంత కాలంగా అనారోగ్యం తో బాధ పడుతున్నారు. నిన్న లివర్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు తుది శ్వాస విడిచారు. దాదాపు 8వేల నాటకాల్లో నటించిన ఆయన ఊరుమ్మడి బ్రతుకులు,చలిచీమలు,వంటి అభ్యుదయ సినిమాల్లో నటించి కెరీర్ మొదట్లోనే గుర్తింపు పొందారు.
దాదాపు 850 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన రాళ్ళపల్లి నెగెటివ్ రోల్స ద్వారా ఫేమస్ అయ్యారు.  తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లి లో 1955, అక్టోబర్ 10 న జన్మించిన రాళ్ళపల్లి తనికెళ్ళ భరణి లాంటి ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారు. ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం  ప్రకటించారు.

More Related Stories