English   

ఈ సారి అబ్బా అనిపిస్తాడో ? అబ్బో అనిపిస్తాడో ?

devi
2019-05-17 21:01:17

మహేష్ బాబు 25వ సినిమాగా వచ్చిన మహర్షి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆయన 26వ సినిమాకి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. మహేష్ తన తర్వాతి సినిమాను అనిల్ రావిపూడితో చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ మీదకి కూడా వెళ్లనుంది. ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ని ఖాయం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. నిజానికి మహర్షి కోసం వంశీ పైడిపల్లి స్క్రిప్టు దశలోనే దేవిశ్రీ ప్రసాద్‌తో అమెరికాలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయంటే పాటలు అబ్బో అనిపించేలా ఉంటాయని అభిమానులు ఆశించారు. కానీ దేవి మాత్రం అబ్బా అనిపించాడు. రెండు మూడు పాటలు మినహాయిస్తే మహర్షి ఆడియో నిరాశ పరిచింది. నేపథ్య సంగీతం కూడా అంత సోసో గానే ఉంది. కానీ ఈ సినిమా ఫంక్షన్లో మహేశ్ మాట్లాడుతూ, దేవిశ్రీ ప్రసాద్ ను ఆకాశానికి ఎత్తేశాడు. దాంతో తదుపరి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకోవడం ఖాయమని అనుకున్నారు. అనుకున్నట్టుగానే దేవిశ్రీనే తీసుకోమని మహేశ్ చెప్పడం అందుకు దర్శక నిర్మాతలు ఓకే చెప్పేయడం జరిగిపోయాయని సమాచారం. మరి ఈ సినిమా ఆడియోని ఏమనిపిస్తాడో దేవీ ?

More Related Stories