English   

పూజా భలే హ్యాండ్ ఇచ్చిందే ?

pooja
2019-05-18 07:41:07

పూజా హెగ్డే...ముకుంద సినిమాతో తెలుగు తెరంగ్రేటం చేసిన ఈ భామ ఆ తర్వాత ఎన్టీఆర్, మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరోఅల్తో న‌టించి తెలుగులో టాప్ హీరోయిన్స్ రేంజ్ కు చేరుకుంది. ఆమె ఈ మధ్యనే ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసిన ఆమె మహేష్ తో మహర్షి చేసింది. ఇక ఒక పక్కన ప్ర‌భాస్ తో ఒక రొమాంటిక్ మూవీ చేస్తున్న ఈ భామ త్రివిక్రమ్ తో  అల్లు అర్జున్ కాంబో మూవీలో కూడా చేస్తోంది. అయితే ఆమె ఆ మధ్య వ‌రుణ్ తేజ్ తో జిగర్ తండా రీమేక్ మూవీ అయిన వాల్మికీ సినిమాలో నటిస్దుందని, రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేసిందనే వార్తలు వచ్చాయి. డీజె సినిమా చేసిన హరీష్ శంకర్ డైరెక్షన్ కావడం, ముకుందాతో చేసిన వరుణ్ కాంబో కావడంతో ఆమె సినిమా తప్పక చేస్తుందని ప్రచారం జరిగింది. అయితే ముందు ఒప్పుకున్నా ఏమయిందో ఏమో కానీ ఇంకా షూటింగ్ పార్ట్ కి కూడా వెళ్ళకుండానే స‌డ‌న్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు చెప్పి ఆ యూనిట్ కి షాకిచ్చింది పూజా. షూటింగ్ కి వెళ్ళే టైం కి అప్పటికి నా డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని వరుణ్ అండ్ కోకి షాక్ ఇచ్చింది ఈ కన్నడ బ్యూటీ. దీంతో అప్పటికపుడు  మృణాళిని రవి అనే తమిళ అమ్మాయిని ఫైనల్ చేశారట. ఏదేమైనా పూజా మాత్రం భలే హ్యాండ్ ఇచ్చిందే అని అనుకుంటున్నారు సినీ జనం. ఈ వ్యవహారం ఎప్పుడో జరిగినా ఆలస్యంగా బయటకు వచ్చింది.

 

More Related Stories