English   

మోహన్ బాబు భార్యగా ఐష్ ?

mohanbabu
2019-05-18 08:29:47

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ హిస్టారికల్ మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.  త‌మిళ ర‌చ‌యిత కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ న‌వల ఆధారంగా ఈ సినిమాని రూపొందించ‌నున్నాడు. హిస్టారికల్ కధ లో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ న‌టించ‌నున్నారు. ఇక ఈ మూవీలో నందిని పాత్ర కోసం ఐశ్వ‌ర్య రాయ్ ను మ‌ణిర‌త్నం సంప్ర‌దించగా, నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్ర అయిన‌ప్ప‌టికీ న‌ట‌న ఆస్కారం ఉండ‌టంతో ఆమె వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో తెలుగు నటుడు మోహన్ బాబు కూడా నటించనున్నాడు, ఆయన భార్య పాత్రలోనే ఐష్ నటించనుందని అంటున్నారు. ఆమె చేస్తున్న పాత్ర రాజ్యాధికారం కోసం ద్రోహం చేసేదిగా ఉంటుందట. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories