English   

జాన్వీ సినిమా షూట్ ఆగింది...అందుకేనట ?

kapoor
2019-05-18 09:29:25

శ్రీదేవి ముద్దులు కూతురు జాన్వీ గతేడాది ధడక్ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెకి ఎన్నో ఆఫర్లు వచ్చిన తండ్రి మేనేజ్మెంట్ లో ఆమె సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఇక ఆమె కరణ్ జోహార్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న‌ భారీ బడ్జెట్ సినిమా చిత్రం తక్త్ తో పాటు ఐఏఎఫ్‌ విమానం నడిపిన తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవిక కధ ఆధారంగా తెర‌కెక్కుతున్న బయోపిక్ లో కూడా న‌టిస్తోంది జాన్వీ. గుంజ‌న్ స‌క్సేనా పాత్ర‌లో జాన్వీ న‌టిస్తుండ‌గా, ఆమె సోద‌రుడి పాత్ర‌లో అంగ‌డ్ బేడీ న‌టిస్తున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ ఈ చిత్రంలో హీరోగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. మ‌హిళా పైల‌ట్ అయిన గుంజ‌న్ 1999 కార్గిల్‌ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి ప్ర‌శంస‌లు పొందింది. ఆమె ధైర్యానికి మెచ్చిన ప్ర‌భుత్వం శౌర్య‌వీర్ అవార్డ్ కూడా అందించింది. అయితే ఆమె ఫ్లయింగ్ జీవితానికి సంబందించి ప్రస్తుతం ఇండోర్‌ లోని ఫ్ల‌యింగ్ క్ల‌బ్‌లో సీన్స్ తెర‌కెక్కిస్తున్నారు. అయితే అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డింద‌ట‌. అక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ షూట్ వాయిదా వేయాలని భావిస్తుందట యూనిట్.

More Related Stories