English   

మహేష్ మూవీకి ఇంటరెస్టింగ్ టైటిల్ 

Mahesh Babu
2019-05-18 11:17:39

ఈ మధ్యనే తన కెరీర్లో మైలురాయి లాంటి 25వ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తు, సినిమా గురించి ప‌లు ప్ర‌మోష‌న్స్ చేస్తూ సినిమా కలెక్షన్లు మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ ప్రమోషన్స్ కి బ్రేక్ ఇచ్చాక మహేష్ లండన్ టూర్ వెళ్లనున్నాడు, అక్కడ కొన్ని రోజులు ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయనున్న మహేష్ వచ్చీ రాగానే త‌న 26వ సినిమా అనీల్ రావిపూడితో క‌లిసి పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు శరవేగంగా జరుగుతుండగా దాని టైటిల్ మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సరిలేరు నీకెవ్వరూ, రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్స్ ప‌రిశీలిస్తున్నార‌ట. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్ లో నటించనుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ఇక విజయశాంతి, బండ్ల గణేష్ లాంటి యాక్టర్స్ ని రీఎంట్రీ చేయిస్తున్నారని అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.  

More Related Stories