English   

మోహన్ లాల్ తో తలపడనున్న  సల్లూ భాయ్ బ్రదర్ 

Arbaaz Khan
2019-05-18 13:29:55

మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా సిద్ధిఖీ దర్శకత్వంలో 'బిగ్ బ్రదర్' అనే సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉండనుందట. దీంతో ఈ పాత్ర కోసం ఎంతో మందిని పరిశీలించిన దర్శక నిర్మాతలు చివరికి సల్మాన్ సోదరుడైన అర్బాజ్ ఖాన్ ని ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించిన అర్బాజ్ ఖాన్ మలయాళంలో నేను చేస్తున్న మొదటి సినిమా ఇది. సిద్ధిఖీ దర్శకత్వంలో మోహన్ లాల్ గారితో కలిసి నటించబోతున్నందుకు చాలా ఆనందంగా వుంది. షూటింగు ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తితో వున్నానని పేర్కొన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ జూలై నెలలో మొదలుపెట్టి అక్టోబర్లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.  

More Related Stories