English   

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్ 

 NTR
2019-05-18 15:24:55

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే గాయం నుంచి కోలుకుని తిరిగి షూట్ లో పాల్గొంటున్నారు. అయితే చరణ్ తో కలిసి తారక్ నటించిన ఈ సినిమా చూడాలంటే 2020 సమ్మర్ వరకూ ఆగాల్సిందే. అయితే ఈలోగా తమ అభిమాన హీరోని కలిసే అవకాశం ఉన్నా ఈ ఏడాది ఆ చాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20 ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతియేటా తప్పనిసరిగా అభిమానులు ఆ రోజు ఆయన్ని కలిసేవారు. కానీ ఈసారి బర్త్ డే సెలబ్రేషన్ కి తారక్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.  ఎటువంటి హడావుడి చేయవద్దని అభిమానులను కూడా కోరారు. దీంతో ఎన్టీఆర్‌ పుట్టిన రోజున ఆయనకు ఆయన ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవాలని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబందించి ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన ప్రీలుక్‌ను ఈనెల 20న రిలీజ్‌ చేసి తారక్‌ అభిమానులను సంతోష పెట్టాలని రాజమౌళి భావిస్తున్నాడట.

More Related Stories