English   

ఎమోషనల్ పోస్ట్ చేసిన స్వీటీ

anushka
2019-05-18 20:43:56

బ్యూటీ క్వీన్ అనుష్క తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ హృదయాలను తాకుతోంది. గతంలో తన వద్ద పనిచేసిన రవి అనే సహాయకుడు చాన్నాళ్ళ క్రితం మృతి చెందగా, ఆయన వర్థంతి రోజున ఆయనని గుర్తు చేసుకుంటూ అనుష్క పోస్టు పెట్టారు. ''రవీ ఏడేళ్ల కాలం గడిచినా ఇప్పటికీ నువ్వు మా మధ్యనే ఉన్నట్టుగా ఉంది. మరణానంతర జీవితం ఎలా ఉంటుందో తెలియదు కానీ, నువ్వు మాత్రం చిరకాలం నా మనసులో ఉంటావు. మనం ప్రేమించినవాళ్లు నిజానికి మనల్ని ఎన్నటికీ వీడిపోరు. మృత్యువు కూడా దరిచేరని కొన్ని సంగతులు ఉంటాయి. నీ సాహచర్యం కూడా అలాంటిదే రవీ ! " అంటూ ఆమె ఎమోషనల్ గా ట్వీట్ చేశారు ఇక ఈ అనుష్క త్వరలో సైలెన్స్ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లనుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మాధవన్, హాలీవుడ్ స్టార్ మైకేల్ మాడ్సన్ లు కీలక పత్రాలు పోషిస్తున్నారు. 

More Related Stories