English   

యాంకర్ హేమంత్ కారుకు ప్రమాదం

hemanth
2019-05-19 15:41:25

ప్రముఖ నటుడు, యాంకర్, ఆర్జే హేమంత్ ఈరోజు త్రుటిలో పెను ప్రమాదం నుండి బయట పడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఈరోజు పల్టీకొట్టింది. ప్రమాద సమయంలో కారులోనే డ్రైవింగ్ సీట్లో ఉన్న హేమంత్ అదృష్టం కొద్దీ సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకున్న ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. నిన్న విజయవాడలో ‘మహర్షి’ సక్సెస్ మీట్ కు హాజరైన హేమంత్ హైదరాబాద్ కు తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారుకు జగ్గయ్యపేట మండలం మహమ్మద్ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా ఓ గేదె ప్రత్యక్షమైంది. దాన్ని తప్పించబోయిన హేమంత్ ఎంత ప్రయత్నించినా ఆయన వాళ్ళ కాలేదు, దీంతో కారుతో గేదెను ఢీకొట్టాడు. దీంతో అదుపు తప్పిన వాహనం పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో హేమంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Related Stories