English   

సెవెన్ ని కొనేసిన అభిషేక్ పిక్చర్స్

seven
2019-05-19 18:14:34

విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత రత్తయ్య మనవడు జీనియస్ లాంటి కొన్ని సినిమాల్లో నటించిన లావు హవీష్‌ కథానాయకుడిగా నిజార్‌ షఫీ దర్శకత్వంలో రమేష్‌ వర్మ నిర్మించిన సినిమా సెవెన్‌. రెజీనా, నందితా శ్వేత, అనీష్‌ ఆంబ్రోస్‌, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడలు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలకి సిద్దం అవుతోంది. జూన్‌ 5న సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాని అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా క్రేజీ ఆఫర్‌ ఇచ్చి మరీ సినిమా కోనేసుకున్నాడట. కొనేసుకుని ఇప్పుడు అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్ మీద ఈ సినిమాను విడుదల చేస్తారట. ఈ మధ్య కాలంలో అభిషేక్ పిక్చర్స్ కి సరయిన హిట్ పడలేదు. మరి ఈ సినిమా అయినా బ్యానర్ కి ఉపయోగపడుతుందేమో చూడాలి మరి.

 

More Related Stories