English   

నటుడు నాజర్ మీద సంచలన ఆరోపణలు

nassar
2019-05-19 21:09:04

ఎన్నో భాష‌ల‌లో వైవిధ్యమైన పాత్ర‌ల‌తో అల‌రించిన నాజ‌ర్‌ మీద సంచలన ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. న‌టుడిగానే కాకుండా దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగా మంచి ప‌దవిలో ఉన్న ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే నిజ జీవితంలో మాత్రం తల్లిదండ్రులను పట్టించుకోని వ్యక్తి. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కనీసం చూసుకోవడం కానీ వారికీ ఆర్ధిక సాయం కూడా చేయడం లేదని ఆయన సోదరులు ఆరోపించారు. ఆర్ధిక సాయం చేయ‌క పోయినా క‌నీసం వారి బాగోగులు కూడా తెలుసుకోలేని స్థితిలో ఆయ‌న లేరా అని ఆయన సోద‌రులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యంపై ఆయ‌న స్పందించ‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వారు ఆయన్ని హెచ్చ‌రించారు. నాజర్ ఫ్యామిలిలో నాజ‌ర్ పెద్ద వాడు కాగా, ఆయ‌న‌కి ముగ్గురు సోద‌రులు ఉన్నారు. చివ‌రి సోద‌రుడు మానసికంగా వ్యాధిగ్ర‌స్తుడు. అయితే పెళ్ళి త‌ర్వాత త‌ల్లిదండ్రుల‌కి దూరంగా ఉంటున్నారు నాజ‌ర్. అయితే న‌టుడిగా మంచి స్థితిలో ఉన్న నాజ‌ర్ త‌ల్లిదండ్రుల‌ని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, వారు అనారోగ్యంతో ఉన్న ప్ప‌టికి ప‌రామ‌ర్శించ‌డం లేద‌ని నాజ‌ర్ సోద‌రులు మీడియా ముందుకు వచ్చారు. నాజ‌ర్ ఇప్ప‌టికైన త‌ల్లిదండ్రేలకి అండ‌గా ఉండ‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి మేం సిద్ధ‌మ‌ని వారు హెచ్చరిస్తున్నారు.  

 

More Related Stories