English   

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్

 Raghava Lawrence
2019-05-20 10:11:13

నటుడు, దర్శకుడు, నిర్మాత ఇలా ఎన్నో రంగాల్లో తనదైన ప్రతిభ చూపే వ్యక్తి లారెన్స్. సినిమాలో కన్నా  సేవా కార్య‌క్ర‌మాల‌తోనే ఆయన ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాడు. సొంతగా ఆశ్రమాలు ఏర్పాటు చేసి అనాధలకు సాయం చేసే అయన చిన్నారులకి ఓపెన్ హార్ట్ స‌ర్జరీలు చేయించ‌డం ప్ర‌కృతి వైప‌రిత్యాల వ‌ల‌న స‌ర్వ‌సం కోల్పోయిన వారికి కొంత సొమ్ముని విరాళంగా ఇవ్వ‌డం లాంటి మంచి పనులు చేస్తూ ఉంటారు. గ‌త ఏడాది గజ తుఫాను ప్రభావంతో తమిళనాడులో సుమారు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతోపాటు పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. ఎంద‌రో తమా ఇల్లు కూడా పోగొట్టుకున్నారు. అందులో ఓ వృద్ద మ‌హిళకి కూడు, గుడ్డ‌, నీడ లేకుండా పోయింది. కొంద‌రు ప్ర‌జ‌లు ఆ ముస‌లావిడని ఆదుకోమ‌ని ప్రార్ధించారు. ఈ విష‌యం లారెన్స్ దృష్టికి రావ‌డంతో వెంట‌నే స్పందించిన లారెన్స్ ఆ బామ్మ‌కి ఇల్లు క‌ట్టిస్తాన‌ని మాట ఇచ్చాడు. మాట ఇచ్చినట్టుగానే ఇల్లు క‌ట్టించి ఆమె చేతనే నిన్న గృహ ప్రవేశం చేయించాడు. ఇల్లు పూర్తైందని చెబుతూ నిన్న గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేశాడు లారెన్స్‌. ఇక ఆయన తాజాగా  బాలీవుడ్ కాంచన రీమేక్ అయిన లక్ష్మే బాంబ్ సినిమా నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.
 

More Related Stories