English   

విజయ్ హీరొయిన్ కి మహర్షికీ లింక్ అదే ?

 Malavika Mohan
2019-05-20 12:07:23

విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా మారాడు. అర్జున్ రెడ్డి దెబ్బకి మనోడు ఏమి పట్టుకున్నా బంగారం అవుతోంది. ఆ సినిమా మిగిలిన బాషలలో రీమేక్ అవుతుండడంతో మనోడి మార్కెట్ అన్ని బాషలలో కూడా ఏర్పడింది. అయితే ఒకసారి నోటా అనే సినిమా రెండు బాషలలో తీసినా అది రెండు చోట్లా ఇబ్బంది పెట్టింది, ఇక మరోమారు 'డియర్ కామ్రేడ్' సినిమాని సౌత్ లో అన్ని భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నిన్నే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో 'హీరో' అనే సినిమాని విజయ్ చేయబోతున్నాడు, షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటించనుంది. తమిళంలో పలు సినిమాల్లో నటించిన మాళవిక మోహనన్ ఈ మధ్యన రజనీ పేట సినిమాతో పరిచయం అయ్యింది. అయితే ఆమె మొదటి తెలుగు సినిమా మాత్రం హీరో. అయితే ఆమె కంటే ముందు ఆమె తండ్రి మోహనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తమిళం మరియు బాలీవుడ్ లో ఎన్నో పెద్ద చిత్రాలకు హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన మోహనన్ తెలుగులో మొదటి సారి మహర్షి సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. నటిగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న మాళవిక రజినీకాంత్ చిత్రం పేటలో సూపర్ స్టార్ కు చెల్లి పాత్రలో నటించి మెప్పించి విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసింది.

More Related Stories