English   

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ 

Prabhas
2019-05-20 12:42:21

బాహుబ‌లి సిరీస్ త‌రువాత ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా దెబ్బకి ఉత్త‌రాదిలోనూ త‌న‌కంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు ప్ర‌భాస్‌. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చేస్తున్న ‘సాహో’, ‘జాన్‌’ (ప్ర‌చారంలో ఉన్న పేరు) చిత్రాల‌ని  తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే నిజానికి ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ కి దగ్గర పడుతోంది అయినా సరైన అప్ డేట్స్ లేవని ఫ్యాన్స్ అసంతృప్తిలో వున్నారు. అందుకే రేపు సినిమా నుండి ఓ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారట. ఈ మేరకు ప్రభాస్ ఒక చిన్న వీడియో బైట్ రిలీజ్ చేశారు. హే డార్లింగ్స్ మీ అందరికీ రేపు సర్ప్రైజ్ అంటూ ఆయన ఒక  ప్రకటన చేశారు. దీంతో రేపు సినిమా నుండి పోస్టర్ ఏదైనా రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు, ఈ సినిమా రిలీజ్ దగ్గరపడడంతో ఈ మధ్యనే పార్క్ హయాత్ లో ప్రభాస్ తో ఫొటో షూట్ చేశారట. ఈ ఫోటో షూట్ ఫోటోలను ప్రచారానికి వాడబోతున్నారని అంటున్నారు. అంటే ఒక రకంగా ప్రభాస్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభ వార్త అనే చెప్పాలి. 

More Related Stories