English   

మహర్షి పది రోజుల కలెక్షన్స్ ఎంతంటే ?

Maharshi
2019-05-20 12:58:07

మహేశ్‌ బాబు 25వ సినిమాగా మహర్షి రూపొందింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి పూజా హెగ్డే కథానాయికగా నటించగా అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్వినీదత్‌ నిర్మాతలయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ 10 రోజుల్లో ఈ సినిమా 64.82 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 23.50 కోట్లు వసూలు చేయడం విశేషం. మహేశ్ బాబు కెరియర్లోను ఇంతవరకూ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. ఇక దగ్గరలో చెప్పుకోదగిన పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం, సమ్మర్ హాలిడేస్ సీజన్ కావడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. అందువలన ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకోవడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో 88 కోట్లకు పైగా షేర్, 180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లని కలెక్ట్ చేసింది. 

More Related Stories