English   

లాంగ్ వెకేషన్ కి మహేష్...చాలా స్పెషల్ అట  !

Mahesh
2019-05-20 18:25:44

మహేష్ బాబు కెరీర్ లోనే మైలురాయి లాంటి ప్రతిష్టాత్మక సినిమా అయిన మహర్షి సినిమా మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో అటు మహేష్ బాబు అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులు కూడా సినిమాని ఆదరించారు. అందుకే మిక్సడ్ టాక్ సొంతం చేసుకున్నా ఈ సినిమా మొదటి 10 రోజుల్లో 180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రూ. 88 కోట్ల 39 లక్షల షేర్ ని సాధించింది. నిజానికి ఈ సినిమా మహేష్ గత సినిమాల రికార్డులు బద్దలు కొడుతోంది. అయితే నిజానికి మహేష్ మనుపెన్నడూ లేనంతగా 'మహర్షి' సినిమా కోసం కష్టపడ్డారు. ప్రమోషన్లలో పెద్దగా గతంలో కనపడని మహేష్ ఈ సినిమా ప్రమోషన్స్ కి మాత్రం బాగా కనిపించాడు. థియేటర్ కవరేజ్, సక్సెస్ మీట్స్, ఇంటర్వ్యూలు నిర్వహించి సినిమాకు బోలెడంత పబ్లిసిటీ తెచ్చారు. అంతగా కష్టపడ్డ ఆయన ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులూ పూర్తి కావడంతో కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్పుకు బయలుదేరారు. ఆయన యూరోప్ వెళుతున్నట్టు చెబుతున్నారు, అక్కడే పదిహేను రోజుల పటు వెకేషన్ ఎంజాయ్ చేయనున్నట్టు సమాచారం. అయితే మహర్షి సినిమా సక్సెస్ రీత్యా ఈ ట్రిప్ చాలా మెమరబుల్ అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

More Related Stories