English   

లిరిక్ రైటర్ చంద్రబోస్ ఇంట విషాదం

chandrabose
2019-05-20 19:38:05

ప్రముఖ సినీ పాటల రచయిత చంద్రబోస్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మదనమ్మ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె ఎలాంటి అనారోగ్యానికి గురి కాక పోయినా హార్ట్ ఎటాక్ వలన ఈ ఉదయం ఆమె మరణించి నట్టు సమాచారం. ఇక మదనమ్మ అంత్యక్రియలు బోస్ స్వగ్రామం వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామంలో సాయంత్రం జరగనున్నట్టు కుటుంబ సభ్యుల నుండి అందుతున్న సమాచారం. నరసయ్య, మదనమ్మ దంపతులకు నలుగురు సంతానం కాగా అందులో చంద్రబోస్  చిన్నవాడు. తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను ఇంతటి వాడినయ్యానంటూ బోస్ పలు వేదికలపై తన అమ్మ ప్రేమను చాటుకునేవారు. తన చిన్నతనంలో తన తల్లి మదనమ్మతో కలిసి ఒగ్గు కథలు, చిందు భాగవతాలు చూసేవాడినని పలు వేదికలపై చంద్రబోస్ తెలిపారు. ఈ స్పూర్తే తనను పాటలు రాసేలా ప్రేరేపించిందని చెప్పేవారు.

 

More Related Stories