English   

ఇంకా వదలని కృష్ణ జింకల కేసు

bollywood
2019-05-20 20:12:02

రెండు దశాబ్దాల క్రితం నాటి కృష్ణ జింకల వేట కేసు ఇంకా బాలీవుడ్ ని వదిలేలా కనపడడం లేదు. 1998 సెప్టెంబర్‌లో హమ్ సాత్ సాత్ హై షూటింగ్ సందర్భంగా కంకానీ గ్రామంలో కృష్ణ జింకలను వేటాడి రెండింటిని చంపేశారంటూ సల్మాన్ ఖాన్, సోనాలీ బింద్రే, నీలమ్, టబు, దుష్యంత్ సింగ్‌ల మీద అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అదే ఏడాది అక్టోబర్‌లో బిష్ణోయి గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి విచారణ దశాబ్దాల పాటు సుదీర్ఘంగా సాగింది. విచారణ అనంతరం గత ఏడాది ట్రయల్ కోర్టు, సల్మాన్ ను దోషిగా తేల్చింది. ఆ మూగజీవులను చంపినందుకు గాను వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్‌ ఖాన్‌ కు ఐదేళ్లు జైలు విధించింది. సోనాలీ-నీలమ్-సైఫ్-టబు-దుష్యంత్ లను నిర్దోషులుగా ప్రకటించింది. శిక్ష పడిన తర్వాత ఆయన 2 రాత్రులు జైలులో గడిపారు. అనంతరం బెయిల్ తో జైలు నుంచి బయటకు వచ్చారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో సల్మాన్‌ది ఎంత తప్పు ఉందో అతనితో పాటు ఉన్న వారిది కూడా అంతే తప్పు ఉందని దీనిపై మరోసారి రాజస్థాన్ సర్కారు పిటిషన్ వేయడంతో హైకోర్టు మళ్లీ సినీనటులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను 8 వారాల తర్వాత చేపడతామని హైకోర్టు పేర్కొంది.

More Related Stories