English   

కబీర్ సినిమా కాపీ పేస్ట్....ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు 

 Shahid Kapoor
2019-05-21 12:02:58

నూతన దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినినిమతో ఓవర్ నైట్ లోనే విజయ్ క్రేజీ హీరో అయిపోయాడు. అంత క్రేజ్ వచ్చింది కాబట్టే ఈ సినిమా మీద మిగతా బాషల వారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు, ఇప్పటికె ఈ సినిమా తమిళ్ లో విక్రం కొడుకు హీరోగా వర్మ పేరుతో బాలా తెరకేక్కించగా ఆ సినిమా అవుట్ పుట్ బాలేదని మళ్ళీ సందీప్ శిష్యుడి దర్శకత్వంలో తెరక్కిస్తున్నారు. ఇక మరోపక్క హిందీలో కూడా రీమేక్ చేశారు. హిందీలో రీమేక్ అయిన ఈ సినిమా కబీర్ సింగ్ పేరుతో సందీప్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వచ్చే నెల 21వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ చూసిన ప్రభాస్ కబీర్ సింగ్ సినిమా గురించి తనతో 7 నిముషాల పాటు మాట్లాడారని, సినిమా ఒరిజినల్ మూవీ అర్జునరెడ్డికి కాపీ పేస్ట్ అయితే కాదని సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆయన మాటలు తమకు కబీర్ సింగ్ సినిమా విజయం పై మరింత్ కాన్ఫిడెన్స్ పెంచిందని షాహిద్ కపూర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.

More Related Stories