English   

వామ్మో అవేం స్టంట్ లు కాజల్...సీత యాక్షన్ ట్రైలర్

Sita
2019-05-21 17:31:41

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో డైరెక్టర్ తేజ తెర‌కెక్కించిన సినిమా సీత‌. ఈ సినిమా ఈ వారంలో రిలీజ్ కానుంది. అందుకే సినిమా ప్రమోషన్స్ మీద ద్రుష్టి పెట్టింది సినిమా యూనిట్. ఈరోజు ఈ క్రమంలో రిలీజయిన యాక్షన్ ట్రైలర్ దుమ్మురేపుతోంది. మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువని చెబుతారే కానీ ఇప్పటికీ అది ప్రూవెన్ ఫాక్ట్ కాదని అదే కథతో సీత అనే సినిమా చేశామని అంటోంది యూనిట్. సోనూసూద్ విలన్ గా నటించిన ఈ సినిమాలో కాజ‌ల్ చేసిన స్టంట్స్ ప్రేక్షకుల‌కి ఆశ్చర్యాన్ని క‌లిగిస్తున్నాయి. శ్రీనివాస్ కి అడ్డం వెళ్లి అతని మీద ఎటాక్ చేయడం కోసం వచ్చిన వారిని చితక్కోట్టడం లాంటి సీన్స్ అలరిస్తున్నాయి. ఇక ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంక‌ర నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రుబెన్స్ సంగీతం అందించారు. తాజాగా విడుద‌లైన ట్రైలర్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.

More Related Stories