English   

మొదటి సినిమా కూడా రిలీజ్ కాకుండానే బంపర్ ఆఫర్ కొట్టేసింది

 Ketika Sharma
2019-05-22 10:22:52

కెతికా శర్మ అంటే సడన్ గా తట్టక పోవచ్చు, ఎందుకంటే ఆమె నటించిన ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. ఢిల్లీకి చెందిన ఈ భామ పూరీ కొడుకు ఆకాష్ పూరీ నటిస్తున్న రొమాంటిక్ సినిమాకి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. పూరీ శిష్యుడు అనిల్ ఆడూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూట్ కూడా మధ్యలో ఉంది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకుండానే ఆమె భారీ ఆఫర్ సంపాదించినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడూ తన సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌ను కాకుండా మ‌రో హీరోయిన్‌ను ని కూడా కీల‌క పాత్ర‌లో న‌టింప చేయ‌డం త్రివిక్ర‌మ్ అల‌వాటు. అరవింద లో ఈశా రెబ్బా, అఆ లో అనుపమ, జల్సా లో పార్వతి మెల్టన్ ఇలా ఇప్పుడు ఆ జాబితాలో కెతికా శర్మ చేరుతుందని అంటున్నారు. మరి నిజమెంతో చూడాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

More Related Stories