English   

ఓర్నీ సాహో కూడా కాపీ పేస్టేనా..!

 Saaho
2019-05-22 10:39:50

ఒకప్పుడు ఏమి చేసినా బయటకు వచ్చేది కాదేమో కానీ ఇంటర్నెట్ విశృంఖలంగా ఉన్న ఈరోజున ఏమి చేసినా ఓకే సెకన్లో నెట్ లోకి వస్తుంది. దానికి తాజా ఉదాహరనే సాహో పోస్టర్, ఏఎ మధ్య రిలీజ్ చేసిన ఒక వీడియోలో రేపు త‌న ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేయండి ఓ స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని చెప్పాడు. దాంతో ఫ్యాన్స్ అంతా ఏదో పెద్ద సర్ప్రైజ్ ఉంటుందని పండ‌గ చేసుకున్నారు. తీరా విడుద‌లైన త‌ర్వాత నిమిషాల్లోనే దాని ఒరిజిన‌ల్ పోస్ట‌ర్ నెట్ లో వైరల్ కావ‌డంతో ఇప్పుడు డీలా పడుతున్నారు. నిజానికి సాహో ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుందంటూ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే రిలీజ్ చేసిన పోస్టర్ లో మాత్రం ప్రేక్షకులకు కొత్తదనం కనిపించలేదు. పైపెచ్చు మంచు విష్ణును గుర్తుచేసింది సాహో పోస్టర్. అయితే ఈ పోస్టర్ ని పరిశీలిస్తే బ్రేకింగ్ బ్యాడ్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ పోస్ట‌ర్ ఆధారంగా సాహో పోస్ట‌ర్ డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఇప్పుడు విడుద‌లైన పోస్ట‌ర్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది కూడా. అటు సాహో పోస్టర్ ఇటు బ్రేకింగ్ బ్యాడ్ పోస్టర్ చూడ్డానికి సేమ్ టూ సేమ్ ఉండ‌టంతో షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. ఇది చూసిన త‌ర్వాత ఓర్నీ సాహో కూడా కాపీ పేస్టేనా..! అంటున్నారు. అయితే పోస్ట‌ర్ తేడా కొట్టిన సినిమా మాత్రం గట్టిగానే ఉంటుందని వెనకేసుకు వస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

More Related Stories