English   

ఆ సినిమా కూడా సంక్రాంతికేనట ?

allu arjun
2019-05-22 11:36:04

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఈ మధ్యనే ఒక సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాని ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేయాలని భావించారు, అయితే షూట్ లేట్ అవడం, అదే సమయానికి చిరంజీవి సైరా సినిమా రిలీజ్ కి రెడీగా ఉండడంతో ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా వెనక్కి వెళ్లనుందని అంటున్నారు. అందుకే తెలుగు సినిమాకి కలిసొచ్చే సీజన్ అయిన సంక్రాంతి సీజన్ లో ఆ సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఎటూ లేట్ అవుతోంది, దానికి తోడు సంక్రాంతికి అయితే సినిమా టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు వస్తాయని భావించిన త్రివిక్రమ్ ఆ సీజన్ కే ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో టబు కూడా నటిస్తోంది. నాన్న సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబోలో మూడోది . ఇంతకుముందు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా ఆ రెండు కూడా మంచి హిట్ అయ్యాయి దాంతో ఈ హ్యాట్రిక్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సంక్రాంతికి నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి, మహేష్- అనిల్, బాలయ్య-రవి కుమార్, మారుతి-ధరం తేజ్, మురగదాస్-రజనీ సినిమాలు సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఈ సినిమా కూడా చెరనుంది. ఇక ఈ సినిమాలో కొత్త భామ కెతికా శర్మను కూడా తీసుకుంటున్నారని అంటున్నారు.

More Related Stories