English   

విడాకులకి సిద్దమయిన అమీర్ ఖాన్ మేనల్లుడు

 Aamir Khan
2019-05-22 12:59:50

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్ళిళ్ళు, ఆ తర్వాత ఆ పెళ్ళిళ్ళు పెటాకులు కావాడం మామూలే, అయితే అది మన దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే ఎక్కువ అని చెప్పాలి. అయితే తాజాగా బాలీవుడ్ లో మరో ప్రేమ పెళ్లి చేసుకున్నన జంట విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కనుందని సమాచారం. 8 సంవ‌త్స‌రాల పాటు ప్రేమించికుని ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఓ పాప‌కి కూడా జ‌న్మనిచ్చిన బాలీవుడ్ జంట విడాకుల కోసం ఇప్పుడు చూడడం కాస్త చర్చనీయాంశంగా మారింది. జానే తు యా జానే నా సినిమాతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన ఇమ్రాన్ ఖాన్ త‌క్కువ స‌మ‌యంలో ల‌వ‌ర్ బోయ్‌ ఇమేజ్ సంపాడించి, ఎందఱో అమ్మాయిల క్రష్ గా మారాడు, ఇక ఆయన సీక్రెట్ గా 8 ఏళ్ళుగా ప్రేమించిన అవంతిక మాలిక్‌ ని 2011లో పెళ్లి చేసుకున్నాడు. వీరి దాంపత్య ప్రేమకు గుర్తుగా 2014లో వీరికి ఓ పాప కూడా జ‌న్మించింది. అయితే పెళ్లైన మొద‌ట్లో వీరి సంసారం స‌జావుగానే సాగినా అనంతరం చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌లు వచ్చాయ‌ట‌. హీరోగా అవ‌కాశాలు లేక‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా అవ‌కాశాలు కరువ‌వ్వ‌డంతో నటుడి నుండి ద‌ర్శ‌కుడిగా మారాడు ఇమ్రాన్‌. అయితే ప్రొఫెష‌న‌ల్ లైఫ్ అంత బాగోలేక‌పోవ‌డంతో ఆ ఒత్తిడిని త‌న భార్య‌పై చూపించదాంతోనే ఇద్ద‌రి మ‌ధ్య క‌ల‌త‌లు ప్రారంభం అయినట్టు సమాచారం. అయితే ఇమ్రాన్ మేనమామ అమీర్ ఖాన్ వారిద్దరికి నచ్చ‌జెప్పి సంసారాన్ని చ‌క్క‌బెట్టే ప్ర‌య‌త్నం చేసినా అది వ‌ర్కవుట్ కాలేద‌ని అందుకే ఇక వారిద్ద‌రి విడాకులు లాంచానమే అని అంటున్నారు.

More Related Stories