English   

అందులో కోచింగ్ తీసుకుంటున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda
2019-05-22 13:57:53

విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా డియర్ కామ్రేడ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన ఒక వైపున క్రాంతి మాధవ్ సినిమా చేస్తూనే, మరో పక్క ఈ మధ్యనే తమిళ్ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో సినిమా కూడా ప్రారంభించాడు. అయితే విజయ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు. అయితే స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించనున్నాడట, అందుకే బైక్ రేసింగ్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలు సహజంగా రావడం కోసం విజయ్ దేవరకొండ బైక్ రేసింగులో శిక్షణ పొందుతున్నాడట. అంతర్జాతీయ రోడ్ రేసింగ్ ఛాంపియన్ అయిన రజనీ కృష్ణన్ దగ్గర కొన్ని రోజులపాటు శిక్షణ తీసుకోనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక పేట సినిమాతో తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయం అయిన మళయాళ భామ మాళవిక మోహనన్ ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానుంది. 
 

More Related Stories