English   

ఆర్ఆర్ఆర్ నుండి లేటెస్ట్ అప్డేట్ 

 RRR
2019-05-22 15:50:46

ఆర్ఆర్ఆర్ సినిమా ఏ నిముషాన మొదలు పెట్టారో కానీ ఈ సినిమా మీద ప్రేక్షకులకి ఏర్పడిన ఆసక్తి అంతా ఇంతా కాదు. మరి ఆ ఆసక్తి వలన దిష్టే తగిలిందో ? లేక రిస్కీ ఫైట్ లు పెట్టారో తెలీదు కానీ ఒకరి తర్వత ఒకరు ఇద్దరు హీరోలు గాయపడ్డారు. దీంతో ఈ సినిమా అర్ధాంతరంగా ఆగింది, అయితే ఇప్పుడు ఇద్దరూ లైన్ లోకి రావడంతో మళ్ళీషూటింగును అతిత్వరలో మొదలుపెట్టనున్నారు. హైదరాబాద్ – అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్, చరణ్, అలియా భట్ తదితరులు ఈ షూటింగులో పాల్గొననున్నట్టు సమాచారం. అయితే మరోపక్క ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాకు టైటిల్ పెట్టే బాధ్యతను ప్రేక్షకులకే అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది తమకు తోచిన పేర్లను సజెస్ట్ చేశారు. ఎక్కువమంది మాత్రం ‘రామ రావణ రాజ్యం, రఘుపతి రాఘవ రాజారామ్ అనే రెండు పేర్లనే ఎక్కువ పంపారు. అయితే ఈ సినిమా కథ కూడా ఈ రెండు పేర్లకు దగ్గరగా ఉండటం వలన ఆ రెండు పేర్ల నుండే ఒక కొత్త టైటిల్ తయారు చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. చూడాలి మరి జక్కన్న ఈ సినిమాకి ఏమని నామకరణం చేయనున్నారో ?

More Related Stories