English   

వివాదంలో సీత...తేజ వార్నింగ్....ఎవడు ఆపుతాడో చూస్తా !

sita
2019-05-22 20:29:35

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా రిలీజ్ కానున్న సినిమా సీత. సోనూ సూద్ విలన్‌ గా నటించిన ఈ సినిమా  24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో సీత చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కాజల్ పాత్రని మోడ్రన్ సీత గా పేర్కొంటూ ఆమె  అభ్యంతరకరమైన సన్నివేశాలలో నటించడంతో ఈ వివాదం చెలరేగింది. సీత చిత్రం హిందువుల మనోభావాల్ని వ్యతిరేకించే విధంగా ఉందని భారతీయ యువమోర్చ నేతలు ఈరోజు ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంపై సెన్సార్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేకుంటే విడుదలని అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఈ సినిమా తమకు చూపాకే రిలీజ్ చేయాలని లేదా ఈ సినిమా ఎక్కడ ఆడినా అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తామని, ఈ సినిమా రీళ్లను తగలబెడతామని వారు హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా స్పందించిన తేజ ఈ సినిమా రిలీజ్ అయి తీరుతుందని, ఎవడో ఆపుతాడో చూస్తానని ఆయన గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఈ సినిమా సెన్సార్ అయ్యిందని తాను ఇంకా ఎవడికీ ఈ సినిమా చూపాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే సినిమా ఆపాలని 24 వ తేదీ సినిమా రిలీజ్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

More Related Stories