పెళ్లి కబురు చెప్పనున్న సల్మాన్

ఇండియన్ సినిమాలో అన్ని బాషల్లో కలిపి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. నిజానికి ఈరోజు బాలీవుడ్ లో ఉన్న సగం మంది హీరోయిన్లతో ఆయనకు అఫైర్స్ ఉన్నాయని అనేవారు. ఈ వ్యాఖ్యలలో నిజం ఎంత ఉన్నా వారితో మాత్రం పెళ్లి దాకా వెళ్ళలేదు. దీంతో ఇక సల్మాన్ పెళ్లి చేసుకోరేమోనని కొందరు ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరికొందరు ఏమో సల్మాన్ ఎప్పుడు పెళ్లి వార్త చెప్తాడా అని ఎదురుచూస్తున్నారు. అయితే తనంతట తానుగా సల్మాన్‌ఖాన్ పెళ్లికి సంబంధించిన విషయంపై ఎపుడూ స్పష్టత ఇవ్వలేదు. అసలు సల్మాన్ పెళ్లి చేసుకుంటాడా? లేదా ? అనేది బాహుబలిని కట్టాప్ప ఎందుకు చంపాడు అనే లాగా మిస్టరీగానే ఉండిపోయింది. తాజాగా పెళ్లి అంశంపై ఆసక్తికర క్లూ ఇచ్చాడు సల్మాన్. తాజాగా ఇక నేషనల్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు మే 23న పెళ్లి వార్త చెప్తానని పేర్కొన్నాడు సల్మాన్. మరి లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు సల్మాన్ ఏమి ప్రకటన చేస్తాడో చూడాలి మరి.