వెంకటేష్ హీరోగా లవ్ స్టోరీస్ డైరెక్టర్ సినిమా

వెంకటేశ్ కథానాయకుడిగా సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో వెంకటేశ్ చేసిన కామెడీ ప్రేక్షకులని ఎంత గానో ఆకట్టుకుంది. ఇక ఆయన కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి వెంకీ ‘వెంకీమామ’ అనే సినిమాలో నటిస్తున్నారు. వెంకీమామ సినిమానే కాకుండా తాజాగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరోగా నటించడానికి వెంకటేశ్ పచ్చజెండా ఊపారని సమాచారం. త్రినాథరావు ఓ ఆసక్తికరమైన కథ చెప్పడం, వెంకీ విని సరే అనడం జరిగిపోయాయట. ఈ సినిమా వెంకీ మామ షూటింగు పూర్తికాగానే వెంకటేశ్ మరో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. నక్కిన త్రినాథరావుతో కలిసి వెంకటేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా కామెడీ ప్రధానంగా సాగనుందని సమాచారం. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే వంటి సినిమాలు చేసిన నక్కిన త్రినాథరావు, ఈ సినిమాతొ మరో కామెడీ ఎంటర్టైనర్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.