English   

పెళ్ళికి సిద్దమయిన మరో బాలీవుడ్ జంట 

Varun Dhawan
2019-05-23 17:56:35

బాలీవుడ్‌ లో మరో హీరో పెళ్ళికి సిద్దమయి పోయాడు. హీరో వరుణ్‌ ధవన్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడని, తన ప్రేయసి నటాశా దలాల్‌ తో ఆయనకు ఈ సంవత్సరం డిసెంబర్‌లో పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది.  అది కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అని అది కూడా ఎక్కడో బీచ్ లో పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. పింక్‌ విల్లా అనే వెబ్ సైట్ కథనం ప్రకారం వీళ్లు ఈ సంవత్సరం డిసెంబర్‌లో గోవా బీచ్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ పెళ్లి గురించి ఇప్పటి వరకు వరుణ్‌ కానీ నటాశా కానీ ఎక్కదా బయటపడలేదు. అయితే ఒక వెబ్ సైట్ మాత్రమే ఇలా ఒక కధనాన్ని ప్రచురించింది. ఆ కథనాన్నే సినీ అభిమానులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. నిజానికి వరుణ్‌, నటాశా ఇద్దరు చాలాసార్లు పబ్లిక్‌గా కనిపించారు. వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని చాలా పుకార్లు వచ్చినప్పటికీ కరణ్‌ జోహార్‌ టాక్‌ షో కాఫీ విత్‌ కరణ్‌లో నటాశాతో తనకున్న రిలేషన్‌షిప్‌ గురించి బయట పడ్డారు. తాను నటాషాతో డేట్‌ చేస్తున్నానని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని వరుణ్‌ ఆ షోలో ప్రకటించారు.

More Related Stories