English   

సినీ గ్లామర్...మిశ్రమంగా గెలుపోటములు ! 

Elections 2019
2019-05-23 18:35:47

దేశ వ్యాప్తంగా ఇవాళ వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కొందరు సినీ ప్రముఖులు విజయకేతనం ఎగరవేశారు. ఉత్తర ప్రదేశ్‌ లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం ప్రముఖ సినీ నటుడు రవికిషన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. రవికిషన్ తన ప్రత్యర్థి రాం భుపాల్‌ మీద 3 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నటి సుమలత అంబరీష్ తన ప్రత్యర్థి సినీ నటుడు నిఖిల్ కుమారస్వామి మీద విజయకేతనం ఎగురవేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హేమమాలిని గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ పాఠక్‌పై హేమమాలిని విజయం సాధించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీడియోల్ గెలుపొందారు. అయితే మరోపక్క ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన ప‌వ‌న్ గాజువాక‌, భీమవ‌రం నుండి పోటీ చేయ‌గా ఆ రెండు స్థానాల‌లో ఆయ‌న వెనుకంజ‌లో ఉన్నారు. ఇక ప‌వన్ సోద‌రుడు నాగబాబు న‌ర‌సాపురం లోక్ స‌భ అభ్య‌ర్ధిగా పోటీ చేయ‌గా అక్క‌డ ఆయ‌న‌కి ఓటమి త‌ప్పేలా లేదు. ఇక ప్ర‌ముఖ నిర్మాత పొట్లూరి వి విర‌ప్ర‌సాద్ విజ‌య‌వాడ లోక్‌స‌భ స్థానం నుండి పోటీ చేయ‌గా, ఆయ‌న ప్ర‌స్తుతం వెనుకంజ‌లో ఉన్నారు. ఇక యంగ్ హీరోయిన్ మాధ‌వి లత బీజేపీ నుండి పోటీ చేయ‌గా ఆమె కూడా వెనుకంజ‌లోనే ఉంది. కాంగ్రెస్ త‌ర‌పున నార్త్ ముంబై నుండి పోటీ చేసిన ఊర్మిళ‌ కూడా ఓడిపోయేలా ప‌ల‌క‌రించేలా ఉంది. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, పూన‌మ్ సిన్హా, మిమీ చ‌క్ర‌వ‌ర్తి కూడా వెనుకంజ‌లోనే ఉన్నారు.  

More Related Stories