English   

ఏపీ ఎన్నికల్లో సినీ నేపధ్యంతో గెలిచిన వారు వీరే ?

 Tollywood
2019-05-24 10:58:04

ఏపీలో ఇవాళ వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పలువురు సినీ ప్రముఖులు, వారి దగ్గరి బంధువులు జయకేతనం ఎగరేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ అయిన గల్లా జయదేవ్ తన పార్టీకి గట్టి ఎదురు గాలి వీచినా మళ్ళీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ మీద పోటీ చేసి మంచి మెజారిటీతోనే గెలుపొందాడు. ఇక సినీ ప్రముఖులకి ముఖ్యుడయిన ఫైనాన్సియర్ రఘురామ కృష్ణంరాజు కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఐరెన్ లెగ్ అంటూ పేరున్న సినీ నటి రోజా కూడా ఈ సారి ఎన్నికల్లో ఎన్నికయ్యి ఐరెన్ లెగ్ ముద్రను తొలగించుకున్నారు. ఇక ఎన్టీఆర్ సన్నిహితులు అయిన నిర్మాతలు కొడాలి నని, వల్లభనేని వంశీలు చెరొక పార్టీలో ఉన్నా ఇద్దరూ విజయ కేతనం ఎగురవేసారు. ఇక సినీ నటుడు బాలకృష్ణ కూడా హిందూపూర్ లో తనకు ఎదురు లేదని నిరూపిచుకున్నాడు. ఇక రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన నటుడు, నిర్మాత మార్గాని భరత్ కూడా గెలుపు గంట మోగించాడు. ఇక డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరుడు కన్నబాబు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అలాగే డైరెక్టర్ పూరీ జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్‌ గణేష్‌ కూడా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు.  

More Related Stories