English   

ఇక తారకరముడే దిక్కు ?

Jr NTR
2019-05-24 11:46:42

ఏపీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ 23 సీట్లకే పరిమితమయ్యింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ కూడా ఒక్క నియోజకవర్గంలో కూడా విజయం సాధించలేకపోయాడు. ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబా నాయుడు కూడా గతంలో కంటే చాలా తక్కువ మెజారిటీతో బయట పడ్డాడంటే టీడీపీ పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వర్మ లాంటి వారు టీడీపీని చంద్రబాబును హేళన చేస్తూ మాట్లాడుతుంటే, జనసేనను గట్టిగా ప్రమోట్ చేసిన కమెడియన్ బ్యాచ్ అంతా ఇదో బ్లాక్ డే అని పోస్ట్లు పెడుతున్నారు.  ఈ క్రమంలోనే టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన మోదీతో పాటు జగన్ కు కూడా శుభాకాంక్షలు చెబుతూనే మరో ట్వీట్ లో ‘ఇక మా తారకరాముడే ఆదుకోవాలి‘ అంటూ బ్రహ్మాజీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి పట్టిన గతిని గుర్తు చేస్తూ ఇక టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని తారక్ దిగితే కానీ పరిస్థితి మళ్ళీ దారిలోకి రాదని భావన వచ్చేలా బ్రహ్మాజీ ఆ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ ని తారక్ ఫ్యాన్స్ వేల సంఖ్యలో రీ ట్వీట్ లు చేస్తున్నారు. 

More Related Stories