English   

అలా చేస్తే బాబుకు పాదాభివందనం చేస్తారట ? 

 Posani
2019-05-24 12:03:33

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ వన్ లీడర్ గా అవతరించారని సినీనటుడు, వైసీపీకి ముందు నుండీ అండగా నిలుతున్న పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఇష్టమైన జగన్ సీఎం కావడం సంతోషంగా ఉందని, ఇక తన జీవితంలో అన్ని కోరికలు తీరిపోయాయని అన్నారు. జగన్ కు చంద్ర బాబు అభినందనలు తెలిపినందుకు సంతోషమని అన్నారు. ప్రజల తీర్పు చూసి చంద్ర బాబు మారిపోయారనుకుంటున్నానని అన్నారు. ఒకప్పుడు జగన్ పై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారన్నారు. జగన్ పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేయొద్దని, జగన్ అవినీతిపరుడు కాదని ప్రజలు నమమారని అందుకే గెలిపించారని అన్నారు. కేసీఆర్ సీఎం కావాలని గతంలోనూ దేవుడిని కోరి మొక్కులు తీర్చుకున్నానని ఇప్పుడు జగన్ ఘన విజయం సాధించడంతో తాను మొక్కిన మొక్కులు తీర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. జగన్ సుపరిపాలన అందిస్తారని చెప్పారు. జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. - చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, మెసాలు మానేస్తే నేను ఆయనకు పాదాభివందనం చేస్తానని పోసాని పేర్కొన్నారు.

More Related Stories