English   

మళ్ళీ రిపీట్ కానున్న హిట్ కాంబో ?

  NTR
2019-05-24 12:21:59

అరవింద సమేత సినిమాతో బంపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించడంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈసినిమాని 2020 జూన్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసినిమా షూటింగ్ ఎలా లేదనుకున్నా మరో ఏడెనిమిది నెలల పాటు ఉండనుండటంతో ఎన్టీఆర్ మరో సినిమాలో నటించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈసినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడనే దాని మీద ఆసక్తి నెలకొని ఉంది. మొన్నటి వరకూ కొరటాల శివతో ఉంటుందని ప్రచారం జరిగినా తాజాగా త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. నిజానికి ఎన్టీఆర్ పుట్టిన రోజున త్రివిక్రమ్ హారికా హాసినీ క్రియేషన్స్ పేరిట ఒక పోస్టర్ కూడా రిలీజయ్యింది. అయితే తాజాగా మరో విషయం కూడా బయటకు వచ్చింది, ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలు చేయోద్దనుకోవడంతో ఫ్యాన్స్ తో కాసేపు సమయం గడిపాడట. దీంతో ఆ సమయంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా తెరకెక్కించిన విధానం తనకు నచ్చడంతో మరోసారి త్రివిక్రమ్ తో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నానని ఫ్యాన్స్ దగ్గర మనసులో మాట బయటపెట్టాడట ఎన్టీఆర్. త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీతో సినిమా చేస్తున్నాడు. మరి ఈ కాంబినేషన్ మీద క్లారీటి రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

More Related Stories